Friday, October 22, 2021

హీరో రామ్ కు తీవ్ర గాయం

ఎనర్జిటిక్ హీరో రామ్ కు సినిమా షూటింగ్ లో తీవ్ర గాయాలైయ్యాయి. ప్రస్తుతం రామ్ తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసం కొత్త లూక్ ట్రై చేస్తున్నారు. ఇందు కోసం జిమ్ లో గంటలు గంటలు కష్టపడి వర్క్ ఔట్లు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ మెడకు బలమైన గాయం అయినట్టు తెలుస్తోంది. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితులు తెలిపారు. మెడ‌కు బ్యాండేజ్ ఉన్న ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.

ఈ మూవీలో రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ హీరో ఆర్య విలన్ గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతుండగా..ఈ చిత్రంతో రామ్ తమిళంలో ఎంట్రీ ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News