Thursday, April 25, 2024

మా ఎన్నికలు: రాజీవ్ కనకాల మద్దతు ఎవరికంటే?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు వేడి  పెంచుతున్నాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధానంగా విష్ణు ప్యానల్.. ప్రకాశ్ రాజ్ పై లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. మంచు విష్ణుకు మద్దతుగా ఉన్న కొందరు నటులు కూడా ప్రకాష్ రాజ్ పై విమర్శలు చేస్తున్నారు.

తాజాగా మా ఎన్నికలపై నటుడు రాజీవ్ కనకాల స్పందించాడు. తాను మంచు విష్ణు ప్యానల్‌కు సపోర్ట్ చేస్తున్నానని ప్రకటించారు. తాను జనరల్ సెక్రటరీగా పోటీ చేయకుండా తప్పుకున్నానని తెలిపారు. ఆ స్థానంలో రఘుబాబు పోటీ చేస్తున్నారని తెలిపారు. అయితే, ఆయన ఎక్కడా కూడా ప్రచారం చేసుకోవడం లేదని, అందుకే తాను ఆయనకు మద్దతుగా ఉంటానని చెప్పారు. తాను మంచు విష్ణు ప్యానెల్‌కు ఓటు వేస్తానని రాజీవ్ కనకాల స్పష్టం చేశారు.

తెలుగువారు అందరినీ చాలా బాగా ఆదరిస్తారని అన్నారు. ‘’గెస్టుగా నా ఇంటికి వచ్చినప్పుడు చక్కగా భోజనం పెడతారు.. సకల మర్యాదలు చేస్తారు.. కానీ ఆ గెస్ట్ నా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని.. నీ ఇంట్లో వ్యవహారాలు సరిగా జరగట్లేదు.. నీ ఇంటి సంగతి నేను చూస్తా’’ అంటే మీరు ఒప్పుకుంటారా? అని అని రాజీవ్ ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ రాక అలానే ఉందని. నీ ఇంట్లో సరిగ్గా జరగడం లేదు నేనొచ్చి చేస్తా అన్నట్లు ఉందని రాజీవ్ కలకాల ఘాటుగా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement