Thursday, April 25, 2024

ఆర్థిక ఇబ్బందుల్లో నటి పావలా శ్యామల.. సహాయం కోసం ఎదురుచూపులు

హాస్యనటిగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రస్తుతం అనారోగ్య పరిస్థితులతో సినీ ఇండస్ట్రీకి దూరమైన ఆమె హైదరాబాద్‌లో ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని కష్టంగా జీవనం సాగిస్తోంది. దాదాపు 250 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నఆమె.. ఆర్థిక కారణాల వల్ల అవార్డులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఆమెకు నెలకు రూ.10వేల పెన్షన్ వచ్చేలా సహాయం అందించారు. అయితే ప్రస్తుతం ఆ పెన్షన్ కూడా సరిగ్గా రావడం లేదని ఆమె ఆవేదన చెందుతోంది. గత మూడు నెలలుగా ఇంటి అద్దె కూడా కట్టలేదని వాపోయింది.

శ్యామల ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఆర్టిస్ట్‌ కరాటే కల్యాణి తన వంతు సాయాన్ని అందించారు. అలాగే మా అసోసియేషన్‌ ద్వారా కూడా సహాయం అందేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరు పావలా శ్యామలను ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కాగా వర్షం, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, గోలీమార్ వంటి సినిమాల్లో పావలా శ్యామలా నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement