Friday, April 19, 2024

మీరాబాయ్ చానూపై హీరో మాధవన్ వ్యాఖ్యల్లో అర్థమేంటో?

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన మీరాబాయ్ చానూ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రశంసలు కురుస్తున్నాయి. అంతేకాకుండా ఆమెకు పలు రివార్డులు కూడా అందుతున్నాయి. అయితే తాజాగా మీరాభాయ్ .. నేలపై కూర్చొని భోజనం చేస్తున్న ఫోటో కూడా ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోని చూసిన నెటిజ‌న్స్.. ఏ మాత్రం అహం లేకుండా సింపుల్‌గా ఉంటున్న మీరాభాయ్, చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఫొటోపై ప్రముఖ తమిళ హీరో మాధ‌వన్ స్పందించాడు. ‘అసలు ఇది నిజమేనా.. నేను నమ్మడం లేదు’ అంటూ ఆయన పేర్కొన్నారు. ఉపాధి లేక‌పోయిన మ‌హిళ‌లు ధృడ సంక‌ల్పంతో ముందుకు వెళ్లాలి అనే కోణంలో మాధ‌వ‌న్ స్పందించాడు అంటూ అయ‌న అభిమానులు చెబుతున్నారు. కొంద‌రేమో ఆయ‌న కామెంట్ అంత‌రార్ధం ఏంటో తెలియ‌డం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన ఏపీ

Advertisement

తాజా వార్తలు

Advertisement