Monday, October 18, 2021

మా ఎన్నికల్లో అతన్నే గెలిపించండి: ప్రకాశ్​రాజ్ పై కోటా సంచలన కామెంట్

‘మా’ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్​రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ ​ పోటాపోటీగా మద్దతు కూడగడుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నటులను కలిసి మంచు విష్ణుకు మద్దతు ప్రకటించారు. ప్రకాష్ రాజ్ కు మెగా సపోర్ట్ ఉందని నాగబాబు స్వయంగా ప్రకటించగా.. మంచు విష్ణుకు కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ వంటి హీరోలు సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరో సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావును విష్ణు ప్యానెల్ కలిసింది. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరింది. ఈ సందర్భంగా కోటా మాట్లాడుతూ.. “నేను మంచు విష్ణుకి సపోర్ట్ చేస్తాను. ‘మా’ అధ్యక్షుడిగా నిలబడడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ నటన గురించి ఏం మాట్లాడను. నేను నేషనల్ లెవెల్ నటుడిని, నాకు నంది వంటి అవార్డులు వచ్చాయి అని నేను చెప్పుకోను. కానీ ప్రకాష్ రాజ్ గురించి ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ప్రకాష్ రాజ్ తో నేను 15 సినిమాలు చేశాను. అన్నీ మెయిన్ రోల్సే. అతను ఎప్పుడూ టైంకి షూటింగ్ కి రాడు. ఆలోచించి ఓటు వేయండి. మంచు విష్ణుని గెలిపించండి” అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఇండ్లు లేని వారికి రూ.5 లక్షలు.. తెలంగాణలో కొత్త పథకం!

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News