Thursday, April 25, 2024

టాలీవుడ్ లో మరో విషాదం.. నటుడు శ్రీనివాస్ మృతి

టాలీవుడ్‌ లో మరో విషాదం చోటు చేసుకుంది. నటుడు కొంచాడ శ్రీనివాస్‌ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి మరణించారు. ఆయన వయస్సు 47 సంవత్సరాలు. శ్రీనివాస్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

శ్రీకాకుళం జిల్లా పలాస పరిధిలోని కాశీబుగ్గకు చెందిన శ్రీనివాస్.. సుమారు 40కి పైగా సినిమాలు, 10 కి పైగా సీరియల్స్‌ లో నటించారు. శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌, ప్రేమకావాలి, లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement