Wednesday, April 17, 2024

ట్విట్టర్ లో మహేశ్ బాబు హవా..13మిలియన్ల ఫాలోవర్స్

సూపర్ స్టార్ మహేశ్ బాబు అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ట్విటర్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబుని ఫాలో అవుతున్న వారి సంఖ్య 13మిలియన్లకు చేరుకుంది..సోషల్ మీడియాలో మహేశ్‌ బాబుకు క్రేజ్‌ మామూలుగా ఉండదు. సినిమాలు, బ్రాండ్స్ ఎండార్స్‌ మెంట్స్‌ షూటింగ్స్‌ తో ఎప్పుడూ బిజీగా ఉంటారు ఈ సూపర్‌ స్టార్‌.టైం దొరికినప్పుడల్లా సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ట్విటర్‌ లో కనిపిస్తూ.. తన అప్‌ డేట్స్ ఇస్తుంటారు. మహేశ్ బాబు పెట్టే పోస్టులకు లైక్స్‌, షేర్స్‌, కామెంట్లు వర్షంలా కురుస్తుంటాయి. తాజా అప్‌డేట్‌తో సౌతిండియాలో ఎక్కువమంది ఫాలో అవుతున్న యాక్టర్‌గా నిలిచారు మహేశ్ బాబు.తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిన పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో టాప్‌లో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement