Thursday, April 25, 2024

రావణాసురుడు పాత్రధారి అరవింద్ త్రివేది కన్నుమూత

దూరదర్శన్‌లో చిన్నా పెద్ద అందరినీ అలరించిన ‘రామాయణ్’ ధారావాహికలో రావణుడిగా నటించిన అరవింద్ త్రివేది కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. గుండెనొప్పితో మంగళవారం రాత్రి ఆయన మరణించారు. త్రివేది మరణవార్తను ఆయన సహ నటుడు సుశీల్ లహిరి ఈ తెల్లవారుజామున ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇది విచారకరమైన వార్త అని, తమ ప్రియమైన అరవింద్ భాయ్ ఇక లేరని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. 

‘రామాయణ్‌’ సీరియ‌ల్ 1980లో ఎంత పాపుల‌ర్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రామాయణ్‌ సీరియల్‌ను దూరదర్శన్‌ పునఃప్రసారం చేసిన విష‌యం తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలు

Advertisement