Wednesday, March 27, 2024

బీఐఎస్‌ ఆమోదం లేని బొమ్మల తయారీపై చర్యలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌) ఆమోదం  లేకుండా బొమ్మలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి సమాధానమిస్తూ.. బీఐఎస్‌ ఆమోదం లేకుండా  బొమ్మలు తయారు చేస్తున్న వారిపై తరచుగా దాడులు నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న బీఐఎస్‌ మార్క్‌ లేని బొమ్మలు పిల్లల ఆరోగ్యానికి ఎలాంటి చేటు కలిగిస్తున్నాయన్న విషయంపై ప్రభుత్వం మదింపు చేస్తోందా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు. 

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement