Friday, December 6, 2024

నేను త‌ల్లిని కాబోతున్నా.. న‌టి పూర్ణ‌

తాను త‌ల్లి కాబోతున్నాన‌ని స్వ‌యంగా ప్ర‌క‌టించింది న‌టి పూర్ణ‌. ఈ శుభ సందర్భాన్ని తన భర్త, కుటుంబసభ్యులతో కలిసి ఆమె సెలబ్రేట్ చేసుకుంది. కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ అలీని పూర్ణ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 24న దుబాయ్ లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. మరోవైపు తల్లి కాబోతున్న పూర్ణకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పూర్ణ అసలు పేరు షమ్న ఖాసిమ్. కేరళకు చెందిన పూర్ణ తెలుగులో పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించింది. పలు టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం ఆమె దుబాయ్ లో ఉంటోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement