Sunday, December 8, 2024

Delhi | మేయర్ ఎన్నికల్లో ఆప్ విజ‌యం..

రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. కొత్త మేయర్‌గా ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ మహేష్ కుమార్ ఖించి ఎన్నికయ్యారు. ఎస్సీ వర్గానికి చెందిన మూడో మేయర్‌గా మహేశ్‌ ఖించి రికార్డు సృష్టించారు.

కాగా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో ఆప్, బీజేపీల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. కరోల్‌బాగ్‌లోని దేవ్‌నగర్‌ కౌన్సిలర్‌గా ఉన్న మహేశ్‌ ఖించ్‌కు 133 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 130 ఓట్లు వచ్చాయి. దీంతో ఆప్ అభ్యర్థి మహేశ్ స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement