Wednesday, March 29, 2023

విద్యుత్ ఘాతానికి యువకుడు మృతి.. పెగడపల్లి గ్రామంలో విషాదం

కొత్తగూడ, (ప్రభ న్యూస్): విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన పెగడపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే కొత్తగూడ మండలం పెగడపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో జక్కుల దేవేందర్ (20)తండ్రి సారయ్య అనే యువకుడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సాయంత్రం కురిసిన వర్షాలకు దండెంపై ఉన్న బట్టలను తీస్తుండగా దేవేందర్ షాక్ తగిలి క్రింద పడడంతో గమనించిన స్థానికులు హాస్పటల్ కు తరలిస్తుండగా మృతి చెందడని తెలిపారు. దేవేందర్ మరణవార్త తెలియగానే పెగడపల్లి లో విషాధచాయలు అలుముకున్నాయి.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement