Tuesday, May 30, 2023

నిర్మాణంలో ఉన్న గోడ కూలి… నలుగురు మృతి

నిర్మాణంలో ఉన్న గోడ కూలి నలుగురు మృతిచెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ నోయిడా సెక్టార్‌-21లో చోటు చేసుకున్నది. ప్రహరీగోడ కూలిపోయిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. మరికొద్ది మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. సమాచారం ప్రకారం.. డ్రెయిన్‌ మరమ్మతులు చేస్తున్న సమయంలో 200 మీటర్ల పొడవున ప్రహరీ గోడ కూలిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడ 12 మంది కూలీలు పని చేస్తున్నారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకొని శిథిలాలను తొలగిస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement