Wednesday, March 22, 2023

రేట్లు పెంచి లిక్క‌ర్‌ అమ్మిన మ‌ద్యంషాపుకు షాక్‌.. 3 ల‌క్ష‌ల ఫైన్ వేసిన టాస్క్‌ఫోర్స్‌

టేకుమట్ల, (ప్రభ న్యూస్) : అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న దుకాణాదార‌కు పెద్ద మొత్తంలో ఫైన్ ప‌డింది. జయశంకర్ జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలోని ఓ వైన్స్ షాపులో అధిక ధరలకు మద్యం అమ్ముతుండగా ఆదివారం తెలంగాణ స్టేట్ టాస్క్ ఫోర్స్ అండ్ ఎక్సైజ్ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. రూ. 3లక్షల జరిమాన విధించారు.

- Advertisement -
   

ఇటీవల వెలిశాల నుండి టేకుమట్లకు మారిన మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ వైన్స్ షాపులో అధిక ధరలకు బెల్ట్ షాపులకు మద్యం అమ్ముతున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంకట్రాంరెడ్డి, సీఐ చిరంజీవి, ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసి రెడ్ హ్యాండ్ గా పట్టుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement