Thursday, April 25, 2024

ప‌ది సెక‌న్ల‌లో చీర‌క‌ట్టి చూపించిన సేల్స్ మెన్.. వైర‌ల్ గా వీడియో

ఓ సేల్స్ మెన్ చీర‌ను క‌నురెప్ప‌లు మూసి తెరిచేలోగా వేగంగా క‌ట్టుకోవ‌డం విశేషం. పంజాబీ టచ్ అనే ట్విట్టర్ ఎకౌంట్ లో ఈ వీడియోని షేర్ చేశారు. అందులో.. పంజాబీ కుర్రాడు.. కేవలం పది సెకన్లలో చీర కట్టడం పూర్తి చేశాడు. దుస్తుల దుకాణంలోని టేబుల్ పై నిలపడి… నలుపు రంగు చీరను కేవలం పది అంటే… పది సెకన్లలో పూర్తి చేశాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇంత అందంగా చీర కడితే.. ఎవరైనా వెంటనే చీర కొనేస్తారు అని కొందరు కామెంట్ చేస్తుంటే… అమ్మాయిలు కూడా ఇంత సింపుల్ గా, ఫాస్ట్ గా, అందంగా చీర కట్టుకోలేరేమో అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు నెటిజ‌న్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement