Wednesday, April 24, 2024

Delhi | ఏ. కొండూరులో ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్‌.. ఎంపీ కేశినేని ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిడ్నీ వ్యాధులతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న రోగుల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. భారతి పవార్ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కిడ్నీ వ్యాధుల బాధితులు ఎక్కువగా ఉన్న ఏ. కొండూరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో 6 పడకల డయాలిసిస్ యూనిట్ ఏర్పాటుకు పాలనా పరమైన అనుమతుల ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు.

మండలం చుట్టుపక్కల ప్రభుత్వ ఆసుపత్రులలో ఇప్పటికే 4 డయాలిసిస్ యూనిట్లు ఉన్నాయని తెలిపారు. అక్కడి ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా ‘జాతీయ జల్ జీవన్ మిషన్’లో భాగంగా ఏ కొండూరు ప్రాంతంలోని జనావాసాలకు రక్షిత మంచినీరు అందించడానికి రూ. 38 కోట్లతో పథకాలు రూపుదిద్దుకుంటున్నాయని వెల్లడించారు. తదుపరి రూ. 27 కోట్లతో పైపు లైన్ల ద్వారా నీరు అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి డాక్టర్ భారతి పవార్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement