Thursday, April 25, 2024

ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయాలని పాదయాత్ర…

ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయాలని పాదయాత్ర మరియు దీక్ష కరపత్రాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క క్యాంప్ ఆఫీసులో ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లా సాధన ఉద్యమం కూడా ములుగు జిల్లాకు సమ్మక-సారక్క నామకరణం పేరుతోనే ఉద్యమాలు కొనసాగుతున్నాయి అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకార్థం చేయాల్సిందేనని సీతక్క డిమాండ్ చేశారు ఇతర జిల్లాలకు దేవతల పేర్లు పెట్టిన కేసీఆర్ ములుగు జిల్లాకు వనదేవతల పేర్లు ఎందుకు పెట్టలేదని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. గద్వాలకు జోగులాంబ అని కెసిఆర్ కు నచ్చిన దేవుడు కాబట్టి భువనగిరికి యాదాద్రి అని కేటీఆర్ కు నచ్చిన దేవుడు సిరిసిల్లకు వేములవాడ రాజన్న అని కొత్తగూడెంకు భద్రాద్రి అని ఈ విధంగా దేవతల పేర్లు పెట్టిన కేసీఆర్ ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నమ్మకం ఎందుకు పెట్టలేదని ఎమ్మెల్యే విమర్శించారు అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమం ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే సీతక్క అన్నారు ముంజల బిక్షపతి ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ములుగు జిల్లా కేంద్రానికి సమ్మక్క సారక్క నామకరణం చేయాలని ఎన్నో సంవత్సరాలనుండి ఉద్యమం కొనసాగుతుందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

ఈ జాతరలోపు ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు మల్లం పల్లి మండలం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీతక్క డిమాండ్ చేశారు, తాత్కాలిక తరగతులు వై టి సి భవనంలో తరగతులు ప్రారంభించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి కాంగ్రెస్ రైతు కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి రాజేంద్ర గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement