Thursday, April 25, 2024

కోహ్లీ పేరిట సరికొత్త రికార్డ్.. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు

ఈ సీజ‌న్ ఐపిఎల్ లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు ఛేజ్ మాస్టార్ విరాట్‌ కోహ్లీ. అంతే కాకుండా ఆరెంజ్ క్యాప్ రేసులో ఫాఫ్ డుప్లెసిస్ తో పోటీపడుతున్నాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి కోహ్లీ బెంగళూరు తరఫునే ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఒక్కసారి కూడా బెంగళూరు టీమ్ ఐపీఎల్ టైటిల్ సాధించలేదు. అయితే.. ఈ సారి సత్తా చాటి తన జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాలని ఉవ్విల్లూరుతున్నాడు. బ్యాటింగ్ లో సత్తా చాటడమే కాకుండా ఈ ఐపీఎల్ సీజన్ లో కోహ్లీ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌ అని తేడా లేకుండా రికార్డులు తన పేరుపై లిఖించుకుంటూ పోతున్నాడు. తాజాగా ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు.

ఇవ్వాల ఢిల్లీ క్యాపిటల్స్ తో జ‌రుగున్న‌ మ్యాచులో మొద‌ట బ్య‌టింగ్ కు దిగింది ఆర్సీబీ.. అయితే ఈ గేమ్ లో ఐపీఎల్‌ చరిత్రలో 7000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు విరాట్. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా తన పేరును రికార్డు బుక్స్ లో లిఖించుకున్నాడు. ఈ మ్యాచుకు ముందు.. కోహ్లి ఖాతాలో 232 మ్యాచ్‌ల్లో 6988 పరుగులు ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత శిఖర్‌ ధవన్‌ (6536), డేవిడ్‌ వార్నర్‌ (6189), రోహిత్‌ శర్మ (6063) వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement