Saturday, April 10, 2021

ఆ ఎమ్మెల్యే నుంచి నా ప్రాణాలు కాపాడండి – హెచ్ఆర్సీ ముందుకు న్యాయవాది

చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నుండి ప్రాణాలను కాపాడాలని మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు ఓ న్యాయవాది.మంచిర్యాల జిల్లా,మందమర్రి మండలంలో జరుగుతున్న అక్రమన్యాయయాలను ఎదిరించి ప్రజల పక్షాన నిలుస్తున్న తనపై అధికార పార్టీ ఎమ్మెల్యే తన అనుచరులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు న్యాయవాది ముత్యాల వెంకటేష్. మందమర్రిలో గిరిజన భూములనుఆక్రమించి,ప్లాట్లుచేయడాన్ని సవాలుచేస్తూ గిరిజనుల పక్షాన కోర్టులో కేసులు వేయడం జరిగిందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని నాయకులు తన పై తప్పుడు కేసులు పెట్టిచంపడానికిప్రయత్నిస్తున్నారని
న్యాయవాదిఆరోపించారు .

సోషల్ మీడియా ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్న తనను మందమర్రి సిఐ స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో అక్రమ కేసులు పెట్టి చంపుతానని బెదిరిస్తున్నారన్నారు. వామన్ రావు దంపతుల హత్యలా జరగకుండా తనకు ప్రాణారక్షణ కల్పించి, గిరిజనుల భూములను కాపాడి న్యాయం చేయాలనీ మానవ హక్కుల కమిషన్ ను కోరారు.

ఈ విషయంపై స్పందించిన కమిషన్ సెప్టెంబర్ 6 లోపు సమగ్ర విచారణ చేపట్టి దర్యాప్తు నివేదికనుఇవ్వాలనిరామగుండం కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News