లూసెయిల్ స్టేడియంఖతర్‌లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరుగుతున్న స్టేడియంకు దగ్గర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని ఖతర్ అధికారులు తెలిపారు. ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్న లూసెయిల్ స్టేడియం సమీపంలో కెటాయ్ ఫాన్స్ ఐలాండ్ నార్త్ ఫ్యాన్స్ విలేజ్ ఉంది.
- Advertisement -
ఇక్కడికి దగ్గరలో నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్‌లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన నల్లపొగ ఈ ప్రాంతంలో కమ్ముకుంది. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్ని మాపక దళాలు మంటలను ఆర్పేసాయి. అయితే ఎవరూ గాయపడటం కానీ, మరణించడం కానీ జరగలేదని అధికారులు తెలిపారు.