Tuesday, March 28, 2023

మిత్రుల మధ్య గొడవ, ముగ్గురు కాల్చివేత.. రాజస్థాన్‌లో ఘటన

మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మిత్రుల తగాదాలో బాధితుడు తన కుటుంబ సభ్యులతో దాడి చేయగా, ప్రత్యర్థి కుటుంబ సభ్యులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సోదరులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు సైనికాధికారి కాగా, మరొకరు రాజస్థాన్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబుల్‌గా గుర్తించారు.

- Advertisement -
   

కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుక్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు భరత్‌పూర్‌ ఎస్‌ఎస్‌పీ అనిల్‌ మీనా తెలిపారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లా కుమ్‌హర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement