Friday, March 29, 2024

అమ్మకానికి ఆస్తులను వెతకాలన్న కేంద్రం

తమ పరిధిలో ఉన్న ఆస్తుల నుంచి ఆదాయ మార్గాలను ఏమైనా ఉన్నాయో చూడాలని కేంద్రం ఆయా మంత్రిత్వ శాఖలను కోరింది. ఇలాంటి ఆస్తులను మానిటైజ్‌ చేయడం ద్వారా ఆదాయం పొందాలని కేంద్రం చూస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని కేంద్రం ఆయా శాఖలను కోరింది. బడ్జెట్‌లో ఆస్తుల మానిటైజేషన్‌ ద్వారా 1లక్షా 62 వేల,422 కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ ఆస్తుల అమ్మకంపై దేశంలో అన్ని వర్గాల నుంచి ముఖ్యంగా కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రాజకీయ పార్టీలు సైతం కేంద్రం తీరును తప్పుు పడుతున్నాయి.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌(ఎన్‌ఎంపీ) కింద 33,422 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం మానిటైజ్‌ చేసింది. ఇందులో బొగ్గు శాఖ 17 వేల కోట్లతో ముందుంది. కొన్ని మంత్రిత్వ శాఖలు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యాయి. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఆస్తుల మానిటైజేషన్‌ ద్వారా 1,62,422 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 33,422 కోట్లు మాత్రమే సేకరించింది. 2021-22లో 88 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే , 1 లక్షల కోట్లు సమీకరించింది. రెల్వే, టెలికం శాఖలు మాత్రం మానిటైజేషన్‌ ప్రక్రియను వచ్చే సంవత్సరానికి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాయి. ఆస్తులను అమ్మడం ద్వారా నిధుల సమీకరణపై ఆర్ధిక నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది దేశానికి మంచిదికాదని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement