Thursday, April 25, 2024

టీమిండియాకు ఎదురు దెబ్బ.. శ్రేయాస్‌ అయ్యర్‌ రెండో టెస్ట్‌కు దూరం

ఢిల్లి వేదికగా ఫిబ్రవరి 17 నుంచి భారత్‌ ఆస్ట్రేలియాతో మరోసారి తలపడనుంది. అయితే ఆసిస్‌తో జరగనున్న ఈ రెండో టెస్ట్‌కు ముందే టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వెన్నెముక గాయంతో గత కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ ఇప్పుడు రెండో టెస్ట్‌కు కూడా దూరం కానున్నాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ ఇంకా కోలుకోలేదు. అతను ఇంకా రిహాబిలేషన్‌లోనే ఉన్నాడు. దీంతో అతను ఆసిస్‌తో జరిగే రెండో టెస్ట్‌కు దూరం కానున్నాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌కు కూడా శ్రేయాస్‌ అయ్యర్‌ దూరం కానున్నాడు.

నడుము నొప్పితో బాధపడుతున్న అతను తొలి టెస్ట్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతను బెంగుళూర్‌లోని నేసనల్‌ క్రికెట్‌ అకాడమీలో రీహాబిలిటేట్‌ అవుతున్నాడు. ఢిల్లిలోని ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో రెండో టెస్ట్‌ జరగనున్నది. ట్రైనర్‌ ఏస్‌ రజనీ కాంత్‌ శిక్షణలో రిహాబ్‌ ప్రోగ్రామ్‌కు చెందిన కొన్ని వీడియోలను అయ్యర్‌ ఇటీవల పోస్టు చేశాడు. కొన్ని స్వదేశీ మ్యాచ్‌లు ఆడిన తర్వాతే అయ్యర్‌ను మళ్లి జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇరానీ కప్‌ కోసం రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్టులో అయ్యర్‌కు చోటు కల్పించే చాన్సు ఉన్నట్లు కనిపిస్తోంది. మార్చి ఒకటో తేదీ నుంచి మధ్య ప్రదేశ్‌తో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా తలపడనున్నది. అయితే ఇటీవల జడేజా కూడా బ్రేక్‌ తర్వాత ఫిట్‌ నె స్‌ టెస్ట్‌లో భాగంగా తమిళనాడుతో రంజీ మ్యాచ్‌ ఆడాడు. అదే తరహాలోనూ అయ్యర్‌కు డొమెస్టిక్‌ మ్యాచ్‌ ఆడే అవకాశాన్ని ఇవ్వనున్నారు. నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల తర్వాత ఆసిస్‌తో జరిగే వన్డే టోర్నీకి బుమ్రాను తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు.

ప్రస్తుతం స్ట్రెస్‌లో ఉన్న బుమ్రాను తొందరపడి వన్డేల్లో ఆడించడానికి సెలెక్టర్లు ఆస క్తిగా లేరు. లండన్‌లో జూన్‌లో జరగనున్న ప్రపంచ టెస్ట్‌ చాంపియ్‌షిప్‌ ఫైనల్‌కు బుమ్రాను జట్టులో తీసుకునే అవకాశాలున్నాయి. దానికి ముందు అతను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిద్యం వహించనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement