Saturday, April 20, 2024

హైదరాబాద్: ఒక్క బైకుపై ఏకంగా 92 చలాన్లు

హైదరాబాద్ నగరంలో వాహనాలు తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీస్ అవాక్కయ్యారు. ఒక వాహనంపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 92 చలాన్లు ఉన్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరేడ్ మెట్‌లో మల్కాజ్ గిరి ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. రెండు బైకుల మీద ఉన్న పెండింగ్ చలాన్లు చూసి అవాక్కయ్యారు. యూసుఫ్‌గూడకు చెందిన మునావర్ అనే వ్యక్తికి చెందిన టూ వీలర్ బైక్‌పై 52 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే మరో వ్యక్తికి చెందిన బైక్‌పై ఏకంగా 92 పెండింగ్ చలాన్లు ఉండటంతో రెండు బైకులను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement