Saturday, April 20, 2024

తెలంగాణలోని జాతీయ రహదారులపై 9 క్రిటికల్‌ కేర్‌ సెంటర్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని జాతీయ రహదారులలో రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు వైద్య, ఆరోగ్య శాఖ 9 క్రిటికల్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా నిపుణులైన వైద్యులను నియమించనుంది. రాష్ట్ర్రం మీదుగా 25 జాతీయ రహదారులు 5,303 కి.మీ.లు సాగనున్నాయి. 2021లో రాష్ట్రంలోని జాతీయ రహదారులపై 8701 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 1717 మంది ప్రాణాలు కోల్పోయారు. 2022లో 8407 రోడ్డు ప్రమాదాలు జరగగా, 1695 మంది మృతి చెందారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిని గోల్డెన్‌ అవర్‌లో రక్షించే ఉద్దేశ్యంతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న 9 ప్రాంతాలను గుర్తించి అక్కడ వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయడానికి క్రిటికల్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఈ ట్రౌమా కేర్‌ సెంటర్లలో వైద్యారోగ్య శాఖ వైద్య నిపుణులను నియమించనుంది.

ఇదిలా ఉండగా, జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో అత్యవసర వైద్య చికిత్సలు అందించడానికి నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సైతం ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీంతో పాటు అత్యవసర వైద్య చికిత్సలు అందుబాటులో ఉండే ప్రాంతాలకు రోడ్డు ప్రమాద బాధితులను తీసుకు వెళ్లడానికి అంబులెన్స్‌ సౌకర్యాన్ని సైతం ఏర్పాటు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement