Thursday, March 28, 2024

కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో 83,000 ఖాళీలు..

సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ లాంటి సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌లో జనవరి 1 నాటికి మొత్తం 10,15,237 పోస్టులు ఉండగా, 83,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్‌కు తెలియజేసింది. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సఆర్‌పీఎఫ్‌), బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌), ఇండో- టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీఐ), సశాస్త్ర సీమాబల్‌(ఎస్‌ఎస్‌బీ)తో పాటు అసోం రైఫిల్స్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ సమాచారాన్ని ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ లోక్‌సభలో తెలిపారు. జుల్‌ఐ 2022, జనవరి 2023 మధ్య 32,181 మందిని నియమించామని, అదనంగా 64, 444 ఖాళీలకు నోటిఫికేషన్‌ ఇచ్చామని, అవి వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి అన్నారు.

- Advertisement -

పోస్టుల ఖాళీగా ఉండటం వలన సిబ్బందికి ఓవర్‌టైమ్‌ పని చేయాల్సి వస్తుందని అనే వాదనలో నిజం లేదని ఆయన అన్నారు. ఖాళీలను భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ అని, యుపీఎస్‌పీ, ఎస్‌ఎస్‌సీ సంబంధిత బలగాల ద్వారా ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయడానికి హోం మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. సీఆర్‌పీఎఫ్‌ అంతర్గత భద్రతా విధులు, శాంతి భద్రతల నిర్వహణ, జమ్మూకాశ్మీర్‌, ఈశాన్య ప్రాంతంలో మిలిటెన్సీ వ్యతిరేక కార్యకలాపాల కోసం మోహరించునట్లు మంత్రి పార్లమెంట్‌కు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement