Monday, April 12, 2021

సర్పంచ్ అభ్యర్థిగా 81 ఏళ్ల వృద్ధురాలు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నిక‌ల్లో 81 ఏళ్ల వృద్ధురాలు రాణీదేవి (81) స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు. కాన్పూర్ జిల్లాలోని చౌబేపూర్ గ్రామానికి చెందిన ఆమె.. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం నామినేష‌న్ కూడా దాఖ‌లు చేశారు. గ్రామంలో ఇప్ప‌టివ‌ర‌కు ఎంతో మంది నాయ‌కులు స‌ర్పంచ్‌లుగా ప‌నిచేసినా ఎవ‌రూ గ్రామాన్ని పెద్ద‌గా అభివృద్ధి చేయ‌లేద‌ని, అందుకే ఈసారి తాను పోటీ చేస్తున్నాన‌ని పేర్కొన్నారు. ఈ ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపిస్తే గ్రామంలో స‌మూల మార్పులు తీసుకొస్తాన‌ని ఆమె చెబుతున్నారు. గ్రామంలో ప్ర‌జ‌ల‌కు పంచాయ‌తీ త‌ర‌ఫున అందాల్సిన‌ అన్ని ర‌కాల సౌక‌ర్యాల‌ను మెరుగుప‌రుస్తాన‌ని, గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాన‌ని ఆమె హామీ ఇస్తున్నారు. త‌న‌కు అవ‌కాశం ఇస్తే గ్రామం రూపురేఖ‌లే మార్చి చూపిస్తానంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News