Thursday, April 18, 2024

24 గంటల్లో 8వేల కేసులు.. లక్షకు దిగువన యాక్టివ్‌ కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో.. ఒమిక్రాన్‌ భయాందోళన కలిగిస్తోంది. పదుల సంఖ్యలో అనుమానితులు ఉన్నారు. వారి జీనోమ్‌ సీక్వెన్స్‌ రిపోర్టులు రావాల్సి ఉన్నాయి. శుక్రవారం 12,52,596 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 8,603 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. గురువారంతో పోలిస్తే.. కొత్త కేసులు తగ్గ్గాయి.

అలాగే శుక్రవారం దేశ వ్యాప్తంగా 8,190 మంది కోలుకున్నారు. క్రియాశీల కేసులు లక్ష దిగువనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 99,974గా ఉంది. క్రియాశీల రేటు 0.29 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.35 శాతంగా ఉందని కేంద్రం ప్రకటించింది. గతేడాది ప్రారంభం నుంచి 3.46 కోట్ల మందికి కరోనా సోకగా.. 3.40 కోట్ల మంది కోలుకున్నారు. శుక్రవారం ఒకే రోజు 415 మంది చనిపోయారు. మొత్తంగా 4.7 లక్షల మంది చనిపోయారు. శుక్రవారం 73.6 లక్షల మంది టీకా వేయించుకోగా.. మొత్తం మీద 126 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement