Thursday, March 30, 2023

రీజనల్‌ రింగ్‌ రోడ్‌లో 8 భారీ ఇంటర్‌ ఛేంజర్లు.. 100 మీ.ల వెడల్పుతో ఎలివేటెడ్‌ కారిడార్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రీజనల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు నేపథ్యంలో అధికారులు రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించారు. 158.6 కి.మీ.ల నిడివితో రూపొందే ఈ భాగం రోడ్డులో 8 ప్రాంతాలలో భారీ కూడళ్లు ఏర్పాటు కానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్‌ప్రెస్‌ వేలలో ఇవి మేటిగా ఉండనున్నాయి. రీజనల్‌ రింగ్‌ రోడ్డు ముందుగా నాలుగు వరుసలుగా నిర్మాణం చేయాలని తొలుత భావించినప్పటికీ భారీగా మార్పలు చేర్పులు చేసి భవిష్యత్తులో 8 లేన్లుగా దీనిని విస్తరించనున్నారు. దీంతో భావి అవసరాలకు సరిపడేలా ఈ ఇంటర్‌ ఛేంజ్‌ నిర్మాణాలు రూపుదిద్దుకోనున్నాయి. కాగా, మార్పుల నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర్ర రహదారులను క్రాస్‌ చేసే చోట దాదాపు 100 మీ.ల వెడల్పుతో ఎలివేటెడ్‌ కారిడార్లను నిర్మించనున్నారు.

- Advertisement -
   

ఈ క్రాసింగ్‌ మద్ద ఇప్పటికే ఉన్న రోడ్ల నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ పైకి వాహనదారులు రావడానికి, ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి దిగవనున్న రోడ్లకు వెళ్లేందుకు ఈ క్లవర్‌ లీప్‌ ఇంటర్‌ చేంజెస్‌ అవకాశం కల్పిస్తాయి. సర్వీసు రోడ్లతో వీటిని అనుసంధానించనున్నాయి. కొత్తగా మారిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్లాన్‌ ప్రకారం… హైదరాబాద్‌ ముంబై జాతీయ రహదారిపై పెద్దాపూర్‌, గిర్మాపూర్‌ గ్రామాల మధ్య, సంగారెడ్డి, నాందేడ్‌ రహదారి శివంపేట సమీపంలోని ఫసల్‌వాది సమీపంలో, మెదక్‌ హైదరాబాద్‌ రోడ్డు రెడ్డిపల్లి, పెద్ద చింతకుంట వద్ద, హైదరాబాద్‌ నాగ్‌పూర్‌ రోడ్డు తూఫ్రాన్‌ సమీపంలోని మాసాయిపేట వద్ద, హైదరాబాద్‌ కరీంనగర్‌ రాజీవ్‌ రహదారి గౌరారం సమీపంలోని గుందాన్‌పల్లి వద్ద, హైదరాబాద్‌, వరంగల్‌ జాతీయ రహదారి భువనగిరి, రాయ్‌గిరి మధ్య, జగదేవ్‌పూర్‌ చౌటుప్పల్‌ రోడ్డు మందాపురం పెనుమాటిపురం వద్ద, హైదరాబాద్‌, విజయవాడ హైవే చౌటుప్పల్‌ సమీపంలోని బంగారిగడ్డ వద్ద నిర్మించనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement