Saturday, July 24, 2021

తెలంగాణ లో కొత్తగా 767 కరోనా కేసులు

తెలంగాణ లో అదే స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 6,33,146కు చేరింది. అలాగే మరో ముగ్గురు మృతి చెందారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం మరణాల సంఖ్య 3,738కి చేరింది. అలాగే కరోనాబారి నుంచి గడిచిన 24 గంటల్లో కొత్తగా 848 మంది కోలుకోగా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6,19,344కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,064 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News