Friday, March 29, 2024

రైల్వే ప్రయాణికుల ఆదాయంలో 76% వృద్ధి.. లాభాల‌తో న‌డుస్తున్న ఇండియ‌న్ రైల్వే

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సరకు రవాణాలోనే కాదు, ప్రయాణికుల రవాణాలోనూ రైల్వే ఆదాయం పెంచుకుంటోంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఆదాయంలో ఏకంగా 76% వృద్ధి నమోదు చేసింది. ప్రయాణికుల రైళ్ల ద్వారా గత 9 నెలల్లో రైల్వే రూ. 43,324 కోట్ల ఆదాయం గడించింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో గడించిన ఆదాయాన్ని లెక్కించగా, గత ఏడాది ఇదే ఇదే కాలంలో గడించిన రూ. 24,631 కోట్ల ఆదాయంతో పోల్చితే ఈ వృద్ధి రేటు 76 శాతంగా నమోదైంది.

స్పెషల్ ట్రైన్లు నడపడం, డైనమిక్ చార్జీలు, రాయితీలు తొలగించడంతో రైల్వే శాఖకు ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతున్నట్టు ఆ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయంలో 155 శాతం వృద్ధి కనిపించగా, అన్-రిజర్వుడు ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయంలో ఏకంగా 422 శాతం వృద్ధి నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement