Thursday, April 18, 2024

తెలంగాణ లో కొత్తగా 729 కరోనా కేసులు

తెలంగాణ లో అదే స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 729 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరో 5 మంది కరోనాతో మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో 772 మంది కరోనా నుంచి కొలుకున్నారు.

ఇక మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,36,049 కు చేరగా రికవరీ కేసులు 6,22,313 కు పెరిగాయి. అలాగే మొత్తం కరోనా బారినపడి 3756 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9,980 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement