Wednesday, May 19, 2021

ఏపీలో కరోనా కాటుకు కొత్తగా 71మంది బలి

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుంది. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో కొత్తగా 18,972 కేసులు నమోదు అయ్యాయి. అలాగే చికిత్స పొందుతూ రాష్ట్రవ్యాప్తంగా 71మంది మృతి మ‌ర‌ణించారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 11,63,994 ఉండగా యాక్టివ్ కేసులు 1,51,852 ఉన్నాయి. అలాగే కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1003935 కి చేరింది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 8,207 కి చేరింది.

కొత్తగా మరణించినవారిలో తూర్పుగోదావరి లో తొమ్మిది మంది, విశాఖపట్నంలో తొమ్మిది మంది, విజయనగరంలో తొమ్మిది మంది, అనంతపురంలో ఏడుగురు, కర్నూలులో ఏడుగురు ,కృష్ణాలో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News