Thursday, April 25, 2024

హీరోల‌కి 60-హీరోయిన్స్ కి 20-ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హీరో ఎంత పెద్ద‌వ‌య‌సు వాడైనా హీరోయిన్ మాత్రం టీనేజ్ లో ఉండాల్సిందే.ఇదే న‌డుస్తోంది అన్ని వుడ్ ల‌లో.ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోలకు జోడీగా పాతిక నుండి ముప్పై ఏళ్ల వయసు హీరోయిన్స్ నటించడం కామన్ గా మారింది. ఈ ప‌ద్ద‌తిపై బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఘాటుగా స్పందించాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత వివేక్ రెగ్యులర్ గా వార్తల్లో ఉంటూనే ఉన్నాడు.ఆయన ఏం మాట్లాడినా కూడా అది మీడియా లో పతాక స్థాయిలో నిలవడం… ఆయన ప్రతి విషయంలో కూడా కాస్త ఘాటుగా మాట్లాడటం చేస్తుండటం వల్ల వివాదాలు ఏర్పడుతున్నాయి.

హీరోలు 60 ఏళ్ల వయసులో.. 20/30 ఏళ్ల హీరోయిన్స్ తో రొమాన్స్ చేసేందుకు సిద్ధం అవ్వడం అనేది బాలీవుడ్ నాశనంకి దారి తీస్తుంద‌ని తీవ్ర స్థాయిలో స్పందించాడు. వయసు మీద పడిన హీరోలు కూడా ముహానికి మేకప్ వేసుకుని హీరోయిన్స్ పక్కన యంగ్ గా కనిపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సినిమాల్లో వారు యంగ్ గా కూల్ గా కనిపించడం కోసం చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాలు సినిమాలో కొత్తదనం ఉండేందుకు మాత్రం జరగడం లేద‌ని వివేక్ ఆరోపన చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. కాని కమర్షియల్ సినిమాలను ఇష్టపడుతున్న ప్రేక్షకుల కోసం సీనియర్ హీరోలు అలాంటివి చేయక తప్పడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మ‌రి వివేక్ చేసిన ఈ ఆరోప‌ణ‌ల‌పై సీనియ‌ర్ స్టార్ హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement