Thursday, April 25, 2024

దేశంలో 5,500 బ్లాక్ ఫంగస్ కేసులు.. 126 మరణాలు

దేశవ్యాప్తంగా ఓ వైపు ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే.. మ‌రోవైపు బ్లాక్‌ ఫంగస్‌, వైట్ ఫంగ‌స్ కేసులతో బెంబేలెత్తుతున్నారు. ఇప్పటివరకు దేశంలో దాదాపు 5,500 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగుచూశాయి. ఈ వ్యాధి వ‌ల్ల‌ 126 మంది చనిపోయారు. మహారాష్ట్రలోనే ఈ బ్లాక్ ఫంగస్‌ కేసులు కూడా అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 90 మంది బ్లాక్ ఫంగ‌స్ కార‌ణంగా చ‌నిపోయినట్లు అధికారులు చెప్తున్నారు‌. ఆ తర్వాత హర్యానాలో 14 మంది, యూపీలో 8 మంది, జార్ఖండ్‌లో నలుగురు, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు చొప్పున బ్లాక్‌ ఫంగస్‌తో ప్రాణాలు విడిచారు. కొన్ని రాష్ట్రాలు ఈ ఫంగస్‌ కేసులు, మరణాలను పూర్తి స్థాయిలో లెక్కించ‌క‌పోవ‌డంతో.. లెక్క‌ల విష‌యంలో స్ప‌ష్ట‌త కరువైందని నేష‌న‌ల్ మీడియా వివరించింది. కాగా బ్లాక్ ఫంగస్ వ్యాధిని అదుపు చేసేందుకు ఉపయోగించే లిపోసోమల్‌ యాంపొటెరిసిన్‌ బి ఇంజెక్షన్ బ‌య‌ట మార్కెట్‌లో దొర‌క‌డం లేదు. ఈ స‌మ‌స్య‌పై దృష్టి సారించిన కేంద్రం.. ఈ మందుల కొరతను అధిగమించేందుకు మరో ఐదు కంపెనీలకు అనుమతులిచ్చినట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement