Thursday, April 25, 2024

తెలంగాణ‌లో కొత్తగా 531 కరోనా కేసులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కరోనా ఉధృతి రోజు కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 531 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదై న మొత్తం కరోనా కేసుల సంఖ్య 8, 14, 303కు చేరింది. కరోనా నుంచి కోలుకోవడంతో 612 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 4630కు చేరింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 24927 మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో 281 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదు కాగా… ఖమ్మం జిల్లాలో 22, కరీంనగర్‌ 14, మేడ్చల్‌ మల్కాజిగిరిలో34, రంగారెడ్డిలో 42, నల్గొండ 10, సంగారెడ్డిలో 7, అత్యధిక కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement