Sunday, May 9, 2021

కరోనా టెర్రర్: తెలంగాణలో 51 మంది మృతి

తెలంగాణ కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో మరణాలు సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 7,754 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 51 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,507 కేసులు నమోదైనట్లు శనివారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 4,43,360 కరోనా కేసులు నమోదు కాగా, 2,312 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 78,888 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Prabha News