Thursday, March 28, 2024

భారీ వర్షానికి సినిమా థియేటర్‌లో 50 బైకులు ధ్వంసం

హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం ప్రజల జీవితాలను అతలాకుతలం చేసేసింది. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దీంతో స్థానికంగా ఉన్న ఏషియన్ శివ‌గంగ థియేట‌ర్ కంపౌండ్ వాల్‌లోకి భారీగా వ‌ర‌ద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో కాంపౌండ్ వాల్ కూలిపోయింది. ఆ గోడ వెంట పార్కింగ్ చేసిన 50 బైక్‌లు ధ్వంసం అయ్యాయి. సినిమా ఫ‌స్ట్ షో స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఫస్ట్ షో సినిమా చూసి బయట‌కు వచ్చిన ప్రేక్షకులకు సెకండ్ షో కనిపించింది. దీంతో బైక్‌ల య‌జ‌మానులు థియేట‌ర్ యాజ‌మాన్యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement