Thursday, April 25, 2024

ఇంట్రెస్టింగ్ గా.. మీట్ క్యూట్ చిత్ర ట్రైలర్

ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది మీట్ క్యూట్ చిత్రం ట్రైలర్ .మీట్ క్యూట్‌ సినిమాకు విజ‌య్ బ‌ల్గానిన్ సంగీతం అందిస్తుండగా.. వాల్ పోస్టర్‌ సినిమా బ్యాన‌ర్‌పై ప్రశాంతి తిపిర్ నేనితో కలిసి తెర‌కెక్కిస్తున్నారు హీరో నాని. హీరో నాని సోద‌రి దీప్తి ఘంట డైరెక్ట్‌ చేస్తున్న అంథాల‌జీ ప్రాజెక్ట్‌ మీట్ క్యూట్ . రుహానీశర్మ, వర్ష బొల్లమ్మ, ఆదా శ‌ర్మ‌, ఆకాంక్ష సింగ్, శివ కందుకూరి, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నీకు మీట్‌క్యూట్ అంటే తెలుసా.. అనుకోకుండా ఇద్దరు అపరిచితులు కలిసినపుడు.. ఆ క్యూట్ సిచ్యుయేషన్స్..అంటూ అంథాలజీలో సాగే పాత్రలను పరిచయం చేస్తూ నాని వాయిస్‌ ఓవర్‌తో మొదలైంది ట్రైలర్‌. వివిధ రకాల ఏజ్‌ గ్రూప్స్‌ లో ఉన్న వ్యక్తుల పరిచయం మొదలు కొని, వారి ప్రయాణం ఎలా సాగిందనే కథాంశంతో మీట్‌ క్యూట్‌ సాగనున్నట్టు ట్రైలర్‌తో చెప్పింది దర్శకురాలు దీప్తి ఘంట. మీట్ క్యూట్ చిత్రంలో స‌త్యరాజ్‌, రోహిణి, దీక్షిత్‌ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement