Tuesday, October 15, 2024

Delhi | లిక్కర్​ కేసులో 4వ చార్జిషట్​ దాఖలు.. కవితపై అవే అభియోగాలు

ఢిల్లీ లిక్కర్​ కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) ఇవ్వాల (మంగళవారం) 4వ చార్జిషీట్​ దాఖలు చేసింది. పలు అభియోగాలతో కూడిన పత్రాలను రౌస్​ అవెన్యూ కోర్టుకు అందజేసింది. ఇందులో బాగంగా కోర్టు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్​ నేత మనీశ్​ సిసోడియాకు మరోసారి నోటీసులు జారీచేసింది. ఇక.. ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ గత చార్జిషీట్లలో మోపిన అభియోగాలనే ఈడీ మరోమారు ప్రస్తావించింది..  కాగా, లేటెస్ట్​గా ఇచ్చిన చార్జిషీట్​లోనూ కవితపై రొటీన్​ అభియోగాలనే దర్యాప్తు సంస్థ ప్రస్తావనకు తీసుకొచ్చింది. ఇక.. లిక్కర్​ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను పలుమార్లు ప్రశ్నించగా… ఇట్లా ఈ కేసులో ప్రశ్నించిన 51 మంది వివరాలను, వారి సమాధానాలను  మరోమారు అభియోగ పత్రంలో ఈడీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement