Thursday, April 18, 2024

టెస్ట్ లు తగ్గించాల్సిన సమయమా ఇది ? తెలంగాణలో కొత్తగా 4826 కరోనా కేసులు

రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ తెలంగాణ సర్కారు మాత్రం టెస్ట్ ల విషయంలో తీరు మార్చుకోవట్లేదు. మొదట ల‌క్షల్లో చేసిన టెస్టులు ఇప్పుడు సగానికి వచ్చేసాయి. కాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 65,923 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 4,826 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

తాజా గణాంకాల ప్రకారం మొత్తం రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,02,187కి చేరాయి. అలాగే చికిత్స పొందుతూ 32 మంది మృతి చెందారు. మొత్తం ఇప్ప‌టి వ‌రకు 2771 మంది రాష్ట్రంలో కరోనా తో మ‌ర‌ణించారు. ఇంకా రాష్ట్రంలో 62,797 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement