Tuesday, April 23, 2024

బిగ్‌ బజార్‌ కొనుగోలు పోటీలో అంబానీ, అదానీ.. తుది జాబితాలో 48 సంస్థలు

ఫ్యూచర్‌ రిటైల్‌ గత సంవత్సరం దివాళా తీసింది. ఈ గ్రూప్‌ దేశవ్యాప్తంగా బిగ్‌ బజార్‌ పేరుతో భారీ సంఖ్యలో రిటౖౖెల్‌ స్టోర్లు కలిగి ఉంది. మొత్తంగా ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ రిటైల్‌ చేసిన ప్రతిపాదనను ఫ్యూచర్‌ రిటౖౖెల్‌ బోర్డు తిరస్కరించడంతో దివాళా ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే పలు మార్లు ఈ ప్రక్రియను పొడిగించారు. తాజాగా ఫ్యూచర్‌ రిటైల్‌ కొనుగోలు పట్ల 49 సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ చేశాయి. తుది బిడ్డింగ్‌లో ఒక సంస్థ తప్పుకోవడంతో పోటీలో 48 సంస్థలు మిగిలాయి.

- Advertisement -

ఇందులో అదానీ, అంబానీ కంపెనీలు ఉన్నాయి. ఫ్యూచర్‌ రిటైల్‌ గత సంవత్సరం జులైలో దివాళా తీసింది. అప్పటి నుంచి ఈ సంస్థ కొనుగోలు చేసే వారికి కోసం చూస్తోంది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు జులై 15 వరకు గడువు పొడిగించారు. సంస్థ కొనుగోలు, పునరుద్ధరణ ప్రణాళికను 48 సంస్థలు సమర్పించడంతో తుదిపోటీలో నిలిచాయి. రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ ఫ్యూచర్‌ రిటైల్‌ స్టోర్‌లను యాక్సెస్‌ చేయడానికి చట్టపరమైన పరిష్కారాలను తీసుకోవడానికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ నుంచి ఆమోదం పొందాయి.

అయితే ఇప్పటికే రిలయన్స్‌ ఇప్పటికే చాలా స్టోర్లను లీజ్‌లను కొనుగోలు చేయడం ద్వారా స్వాధీనం చేసుకుంది. మరికొన్ని స్టోర్లను భవన యజమానులు అద్దె చెల్లించకపోవడంతో బలవంతంగా ఖాళీ చేయించారు. చాలా నగరాల్లో ప్రధానమైన బిజినెస్‌ సెంటర్లలోఉన్న స్టోర్లను రిలయన్స్‌ వాటి భవన యజమానులతో లీజ్‌ను కొనుగోలు చేసి, రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్లుగా మార్చివేసింది. బ్రాండ్‌, వాటాల కొనుగోలుకు ఈ కంపెనీలు పోటీ పడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement