Monday, May 17, 2021

43,52,58 ఇవి ర్యాంకులు కాదు….తెలంగాణ లో కరోనా మరణాలు

తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంట‌ల్లో 7,994 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 80,181 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఈ కేసులు నమోదు అయ్యాయి. మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా రాష్ట్రంలో మ‌రో 58 మంది మృతి చెందారు. కరోనాతో నిన్న 52, మొన్న 43 మంది మృతి చెందారు.

రాష్ట్రంలో నమోదు అయిన క‌రోనా కేసుల సంఖ్య 4.27 ల‌క్ష‌లు దాటింది. అందులో 3.49 ల‌క్ష‌ల మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 70 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ మ‌హమ్మారికి కారణంగా 2208 మంది మృతిచెందారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News