Saturday, September 30, 2023

దేశవ్యాప్తంగా 370 మోడల్ కెరీర్ సెంటర్లు.. ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రశ్నపై కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నిరుద్యోగ యువతకు తోడ్పాటునందించే క్రమంలో వివిధ రాష్ట్రాలతో సంప్రదించి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్టు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వర రావు మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిస్తూ.. కెరీర్ కౌన్సిలింగ్, వొకేషనల్ గైడెన్స్, నైపుణ్య శిక్షణకు సంబంధించిన సేవలను తమ మంత్రిత్వ శాఖ ద్వారా అందజేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే కెరీర్ సేవలు అందించేందుకు మోడల్ కెరీర్ సెంటర్లను ఏర్పాటు చేశామని, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 370 మోడల్ కెరీర్ సెంటర్లు ఉన్నాయని వివరించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement