Wednesday, December 11, 2024

370 Article – జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో ఆగ‌ని ర‌చ్చ‌

రెండో రోజూ సేమ్ సీన్
అధికార‌,విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య ర‌గ‌డ‌
370 ఆర్టిక‌ల్ పున‌రుద్ద‌ర‌ణ బిల్లుపై వాగ్వాదం
ఎమ్మెల్యే ఖ‌ర్షీద్ ను బ‌య‌ట‌కు ఈడ్చుకెళ్లిన మార్ష‌ల్స్
స‌భ జ‌ర‌గ‌కుండా బిజెపి ఎమ్మెల్యేల నినాదాలు

జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో మ‌రో సారి ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. వ‌రుస‌గా రెండో రోజు బీజేపీ, ఎన్సీ ఎమ్మెల్యేల‌ మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఆర్టిక‌ల్ 370 పున‌రుద్ద‌రించాల‌ని ఇంజినీర్ ర‌షీద్ సోద‌రుడు, అవామీ ఇతెహ‌ద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మ‌ద్ షేక్ గురువారం బ్యానర్‌ను ప్ర‌ద‌ర్శించిన ఆయ‌న నేడు కూడా అసెంబ్లీ స‌మావేశాల‌ను అడ్డుకున్నాడు.. దీంతో ఖుర్షీద్‌ను ఇవాళ మార్ష‌ల్స్ బ‌య‌ట‌కు ఈడ్చుకెళ్లారు. బెంచ్‌ల మ‌ధ్య నినాదాలు చేస్తున్న ఖుర్షీద్‌ను అయిదారు మంది మార్ష‌ల్స్ బ‌ల‌వంతంగా లాక్కెళ్లారు. పీడీపీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

- Advertisement -

మ‌రో వైపు ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును స‌మ‌ర్థిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీ ర‌చ్చ‌రచ్చ‌గా మారింది. జ‌మ్మూక‌శ్మీర్‌కు ప్ర‌త్యేక హోదా క‌ల్పించే 370 ఆర్టిక‌ల్‌ను మోదీ స‌ర్కారు ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఆర్టిక‌ల్‌ను పున‌రుద్ద‌రించాల‌ని జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌భుత్వ తీర్మానం ప్ర‌వేశ‌పెట్టింది. స‌భ‌లో గొడ‌వ కొన‌సాగుతుండ‌టంతో వాయిదా వేశారు స్పీక‌ర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement