Friday, April 19, 2024

తెలంగాణలో మాస్కులు ధరించనివారికి రూ.37.94 కోట్ల జరిమానా

తెలంగాణలో క‌రోనా లాక్‌డౌన్ నిర్వ‌హ‌ణ‌పై హైకోర్టుకు డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి నివేదిక స‌మ‌ర్పించారు. క‌రోనా మెడిసిన్స్ బ్లాక్ మార్కెట్‌పై 160 కేసులు న‌మోదు చేశామ‌ని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 7వ తేదీ వ‌ర‌కు 8.79 ల‌క్ష‌ల కేసులు న‌మోదు చేశామ‌ని పేర్కొన్నారు. మాస్కులు ధ‌రించని వారిపై 4.56 ల‌క్ష‌ల కేసులు న‌మోదు చేసి, రూ. 37.94 కోట్ల జ‌రిమానా విధించామ‌న్నారు. భౌతిక దూరం పాటించ‌నందుకు 48,643 కేసులు, లాక్‌డౌన్, క‌ర్ఫ్యూ ఉల్లంఘ‌న‌ల‌పై 3.43 ల‌క్ష‌ల కేసులు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నామ‌ని డీజీపీ స్ప‌ష్టం చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement