Thursday, April 25, 2024

35 హైడ్రోజన్‌, 500 వందేభారత్‌ రైళ్లు.. వచ్చే బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ సారి భారీ ఎత్తున కొత్త రైళ్లను ప్రకటించే అవకాశం ఉంది. అత్యాధునిక సౌకర్యాలతో అత్యంత వేగవంతమైన రైళ్లను మరిన్నింటిని ప్రవేశపెట్టనున్నారు. ప్రధానంగా 35 హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే రైళ్లు, 400-500 వరకు వందే భారత్‌ రైళ్లను ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 4 వేల వరకు ఆధినిక భోగీలను, 58 వేల వ్యాగన్లను ప్రవేశపెట్టనుంది. వచ్చే మూడేళ్లలోఈ వ్యాగన్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో రైల్వేలకు 1.9 లక్షల కోట్లు కేటాయించే అవకాశం ఉంది. రైల్వేలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. రైళ్లను, రైల్వే కోచ్‌లను, సరకు రవాణా వ్యాగన్లను కూడా ఆధునీకరించాలని భావిస్తోంది. రైల్వే లైన్ల విద్యుద్ధీకరణ పనులను కూడా పూర్తి చేయాలని నిర్ణయించింది. 2030కే కాల్యుషంలేని రైఊల్వేలను తీసుకురావాలని రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు, పథకాల ప్రకటన, పనులు పూర్తి చేయడం వంటివి ఉండనున్నాయి.

రైల్వేలు త్వరలోనే హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే రైళ్లను ప్రవేశపెట్టనుందిన ఇటీవలే రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ప్రకటించారు. ప్రధానంగా డార్జిలింగ్‌, నీలరిగి, కల్కా-సివ్లూ, కాంగ్రా వ్యాలీ వంటి 8 వారసత్వ మార్గాల్లో ప్రోటోటైప్‌ హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ఈ రై ళ్లను నార్తర్న్‌ రైల్వే వర్క్‌షాప్‌లో తయారు చేస్తున్నారు. ప్రస్తుతం హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే రైలును హర్యానాలోని సోనిపట్‌-జింద్‌ సెక్షన్‌లో టెస్ట్‌ రన్‌ నిర్వహిస్తున్నారు.

- Advertisement -

మూడేళ్లలో అమలు చేయనున్న రోలింగ్‌ స్టాక్‌ ప్రోగ్రామ్‌ను 2.7 లక్షల కోట్లతో ప్రకటించనున్నారు. కొత్త తరం రోలింగ్‌ స్టాక్‌తో పాటు, వంద విస్టాడోమ్‌ కోచ్‌లు తయారు చేయడం, ప్రీమియం రైళ్లలో వెయ్యి కోచ్‌లను పునరుద్ధరించడం ఈ కార్యక్రమంలో భాగంగా ఉండనుంది. 500 వందే భారత్‌ రైళ్ల తయారీకి 65 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు, ప్రయాణీకుల భద్రత కోసం రైల్వేల్లో 1000 కోచ్‌లతో నీరు చిమ్మే విధంగా అగ్ని మాపక పరికరాలను అమర్చాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement