Friday, April 19, 2024

నిమ్మ‌కూరులో 35అడుగుల ఎన్టీఆర్ విగ్ర‌హం-రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుదే-బాల‌కృష్ణ‌

నేడు సీనియ‌ర్ న‌టుడు దివంగ‌త ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని సినీనటులు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలా నేనున్నానని ముందుకొచ్చారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారని గుర్తు చేశారు. నిమ్మకూరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, నిమ్మకూరు చెరువు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని, 35 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అంతా తీర్మానించాం అని చెప్పారు.యువకులు రాజకీయాల్లోకి రావాలి.. ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని.. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అంతా చూస్తున్నారన్నారు. రాష్ట్ర పరిస్థితిపై మహానాడులో పూర్తిగా మాట్లడతాన‌ని బాల‌కృష్ణ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement