Friday, March 29, 2024

రిపీట్….తెలంగాణలో కొత్తగా 3043 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా నిర్ధారణ టెస్ట్ లను కూడా అదే స్థాయిలో చేస్తున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా 3వేల స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,043 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో 21 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

తాజా గణాంకాల ప్రకారం మొత్తం రాష్ట్రం లో 5,56,320 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 3,146 మంది మరణించారు. అలాగే కొత్తగా 4,693 మంది కోలుకోగా, 5,13,968కు మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 39,206 యాక్టివ్ కేసులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement