Tuesday, April 23, 2024

‘ప్రేమించుకుందాం.. రా’ అని 24 ఏళ్లు అయ్యింది

విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో సూపర్ హిట్‌ చిత్రాల్లో ‘ప్రేమించుకుందాం.. రా’ సినిమా ఒకటి. ఈ మూవీ నేటితో 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ద్వారా జయంత్. సి. పరాన్జీ టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. అంతేకాదు ఈ సినిమాతో అంజలా జవేరి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మాములు ప్రేమకథకు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కించి దర్శకుడు ఈ మూవీని సూపర్‌హిట్‌గా నిలిపాడు. టాలీవుడ్‌లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన తొలి చిత్రంగా ‘ప్రేమించుకుందాం రా’ సినిమా రికార్డులకెక్కింది.

ఈ సినిమా అప్పటి వరకు వచ్చిన ప్రేమకథల్లో ట్రెండ్ సెట్టర్‌గానూ నిలిచింది. ముఖ్యంగా హీరో వెంకటేష్, అంజలా జవేరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఈ చిత్రానికి మహేష్ అందించిన సంగీతం, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచాయి. మొత్తంగా ప్రేమకథ చిత్రాల్లో ప్రేమించుకుందాం..రా ఓ ట్రెండ్ సెట్టర్ మూవీ అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement